కీలక నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం

దిశ, ఏపీ బ్యూరో: సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో జగన్ సర్కారు దూసుకెళ్తోంది. సక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసంక్షేమంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. గ్రామ, వార్డు […]

Update: 2020-06-09 03:11 GMT

దిశ, ఏపీ బ్యూరో: సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో జగన్ సర్కారు దూసుకెళ్తోంది. సక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసంక్షేమంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మొత్తం 541 రకాల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇందులో భాగంగా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు, సేవలు సత్వరమే అందేలా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న కేవలం 10 రోజుల్లోనే రేషన్ కార్డులు అందజేస్తామని, దరఖాస్తు చేసిన 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News