ఏపీలో సర్కారువారి చేపలు.. ఆంధ్రా మినీ అవుట్‌లెట్స్ ఓపెన్
దిశ, ఏపీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం వినూత్నమైన నిర్ణయాలు కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే మటన్ మార్టులు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఫిష్ అవుట్ లెట్‌లను తెరపైకి తీసుకువచ్చింది. విశాఖలోని పెద గంట్యాడలో ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దీంతో […]
దిశ, ఏపీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం వినూత్నమైన నిర్ణయాలు కూడా అమలు చేస్తోంది. ఇప్పటికే మటన్ మార్టులు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఫిష్ అవుట్ లెట్‌లను తెరపైకి తీసుకువచ్చింది.
విశాఖలోని పెద గంట్యాడలో ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో సర్కారు వారి చేపలు అందుబాటులోకి వచ్చినట్టైంది. విశాఖ పెద గంట్యాడలోని ఫిష్ అవుట్‌లెట్ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఫిష్ ఆంధ్రా మినీ అవుట్ లెట్లు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఫిష్ అవుట్ లెట్లకు చెరువు, సముద్ర చేపలు, రొయ్యలు, పీతలను ప్రభుత్వమే సరఫరా చేయనుంది. వంజరం, చందువ, రొయ్యలు, పీతలు, పండుగప్ప, శిలావతి, బొచ్చ, కొర్రమీను, రాగండి, కట్ల, రూప్ చంద్ వంటి జల ఉత్పత్తులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.