ఏపీ కొత్త నిర్ణయం.. 13 కరోనా జైళ్లు
దిశ. ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ జైళ్లను కూడా వదలకపోవడంతో ఇతర ఖైదీల రక్షణకు నడుంబిగించింది. జిల్లాకొక కొవిడ్ జైలును ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురంలోని 13 జైళ్లను కరోనా జైళ్లుగా మార్చింది. కొత్త ఖైదీల ద్వారా జైలులో అప్పటికే ఉంటున్న ఇతర ఖైదీలకు వైరస్ సోకకుండా ఉండేందుకు ఇకపై నిందితులుగా వచ్చే […]
దిశ. ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ జైళ్లను కూడా వదలకపోవడంతో ఇతర ఖైదీల రక్షణకు నడుంబిగించింది. జిల్లాకొక కొవిడ్ జైలును ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురంలోని 13 జైళ్లను కరోనా జైళ్లుగా మార్చింది.
కొత్త ఖైదీల ద్వారా జైలులో అప్పటికే ఉంటున్న ఇతర ఖైదీలకు వైరస్ సోకకుండా ఉండేందుకు ఇకపై నిందితులుగా వచ్చే పురుష ఖైదీలను ఈ జైళ్లకు తరలించి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా సోకలేదని తేలితే కోర్టు సూచించిన జైలుకు పంపిస్తారు. పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలిస్తారు. ఆయా కోవిడ్ జైళ్లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి వైరస్ సోకకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా జైళ్ల శాఖ డీజీని ప్రభుత్వం ఆదేశించింది.