కరోనా కట్టడికి ఏపీ మరో నిర్ణయం..

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వాప్తి క్రమంగా పెరుగుతోంది. గత మూడ్రోజులుగా ఏపీలో చోటుచేసుకుంటున్న మరణాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కూడా కంటి మీద కునుకు రానీయడం లేదు. కరోనా వైరస్ కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యను కూడా పెంచుకుంటూ పోతోంది. ఈ నెల 11వ తేదీన 17 మంది, మొన్న అంటే 12న 19 మంది, నిన్న అంటే 13న 37 మంది, నేడు 43మంది […]

Update: 2020-07-14 09:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వాప్తి క్రమంగా పెరుగుతోంది. గత మూడ్రోజులుగా ఏపీలో చోటుచేసుకుంటున్న మరణాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కూడా కంటి మీద కునుకు రానీయడం లేదు. కరోనా వైరస్ కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యను కూడా పెంచుకుంటూ పోతోంది. ఈ నెల 11వ తేదీన 17 మంది, మొన్న అంటే 12న 19 మంది, నిన్న అంటే 13న 37 మంది, నేడు 43మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా వైరస్ కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కరోనా పరీక్షల కోసం నమూనాల సేకరణ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వీఆర్డీఎల్ ల్యాబ్‌లు, ట్రూనాట్ ల్యాబుల్లో నమూనా సేకరణ కౌంటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ నమూనా సేకరణ కౌంటర్లు మూడు షిఫ్ట్‌లు పని చేసేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అనుభవంతో ల్యాబ్‌ల్లో సేకరించిన నమూనా ఫలితాలు వచ్చిన వెంటనే కోవిడ్ పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు, కోవిడ్ ప్రొటోకాల్‌ అనుసరించి నమూనాలను జాగత్ర చేయాలని సూచించింది. ఐడీ నంబరు, సరైన మూత లేకుండా నమూనాల సేకరణ, బాక్సింగ్ లాంటి విధానాలు పాటించకుండా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీల్లేదని ప్రభుత్వం ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది.

ఈ ఫలితాలను ఎంఎస్‌ఎస్‌ కోవిడ్ పోర్టల్‌ నమోదు చేయకుండా తిరస్కరించాలి. రెడ్ మార్కింగ్ చేసిన నమూనాలను తొలి ప్రాధాన్యతగా గుర్తించి తక్షణం ఫలితాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మళ్లీ పాజిటివ్ వస్తే ఆ ఫలితాన్ని గతంలో ప్రకటించినందున కొత్తదిగా ప్రకటించాల్సిన అవసరం లేదని సూచించింది. ఎంఎస్‌ఎస్ కోవిడ్ పోర్టల్, ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో నమోదు చేసే ఫలితాలు ఆరు గంటలకన్నా ఆలస్యం అయ్యేందుకు వీల్లేదని వీఆర్డీఎల్ ల్యాబ్స్‌కు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా కరోనా కేసులకు వేగంగా చికిత్స అందించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. తద్వారా కరోనా కట్టడికి అవకాశం ఉంటుందని భావిస్తోంది.

Tags:    

Similar News