ప్రైవేట్ ఆస్పత్రులకు రేట్లు ఫిక్స్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా చికిత్స పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కొవిడ్ వైద్యం అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. చికిత్సకు అయ్యే ధరలను కూడా ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈమేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా ఫీజుల వివరాలు: తొలిదశ కరోనా పేషంట్ల వైద్యానికి రోజుకి రూ. 3,250 ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5980 క్రిటికల్ పేషంట్లకు […]

Update: 2020-07-08 11:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా చికిత్స పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కొవిడ్ వైద్యం అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. చికిత్సకు అయ్యే ధరలను కూడా ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈమేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా ఫీజుల వివరాలు:

తొలిదశ కరోనా పేషంట్ల వైద్యానికి రోజుకి రూ. 3,250
ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5980
క్రిటికల్ పేషంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా చికిత్స చేస్తే రోజుకీ 5,480
క్రిటికల్ పేషంట్లకు ఐసీయూలో వెంటిలేటర్ సాయంతో వైద్యం చేస్తే రోజుకీ రూ. 9,580
ఇన్‌ఫెక్షన్ ఉన్నవారికి వెంటిలేటర్ లేకుండా వైద్యం చేస్తే రూ. 6,280
ఇన్‌ఫెక్షన్ ఉండి వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకు రూ. 10,380
అయితే, ఆరోగ్య శ్రీ పరిధిలోని ఉన్న అన్ని హాస్పటల్‌‌లు ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Tags:    

Similar News