మరో 2 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
దిశ, ఏపీ బ్యూరో: కుటుంబ బాధ్యతల్లో తలమునకలవుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని సీఎం వై ఎస్ జగన్ కోరారు. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళల ఉపాధి కోసం ఏపీ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం మరో 2 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌లో అల్లానా గ్రూప్ (allana group), రిటైల్, ఈ ఫ్లాట్‌ఫాంలో రిలయన్సు జియో (reliance jio) సంస్థలు సహకారం అందించనున్నాయి. ఇప్పటికే అమూల్ (Amul), […]
దిశ, ఏపీ బ్యూరో: కుటుంబ బాధ్యతల్లో తలమునకలవుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని సీఎం వై ఎస్ జగన్ కోరారు. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళల ఉపాధి కోసం ఏపీ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం మరో 2 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్‌లో అల్లానా గ్రూప్ (allana group), రిటైల్, ఈ ఫ్లాట్‌ఫాంలో రిలయన్సు జియో (reliance jio) సంస్థలు సహకారం అందించనున్నాయి. ఇప్పటికే అమూల్ (Amul), హెచ్‌యూఎల్ (HUL), పి అండ్ జి (P&G) కంపెనీలతో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది.
క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం సమక్షంలో అవగాహనా ఒప్పందంపై సెర్ప్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈసందర్బంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ఒకేసారి ఇచ్చే రూ.75 వేలతోపాటు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆ నిధులతో పలు యూనిట్ల స్థాపన ద్వారా పేదరికం నుంచి బయటపడేందుకు దోహదపడుతుందన్నారు. ఆ మేరకు కంపెనీలు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.