మహిళా ఉద్యోగులకు మరో ఏడాది పొడిగింపు

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయం, అసెంబ్లీ, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కల్పిస్తున్న ఉచిత వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పొడిగించింది. హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ, గుంటూరు‌లోని ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రెయిన్ ట్రీపార్కులో వసతి కల్పించారు. మూడు బెడ్ రూమ్ ఫ్లాట్‌లలో ఆరుగురు ఉద్యోగినులు, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నలుగురు చొప్పున ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మూడు […]

Update: 2020-08-28 10:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయం, అసెంబ్లీ, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కల్పిస్తున్న ఉచిత వసతి సౌకర్యాన్ని మరో ఏడాది పొడిగించింది. హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడ, గుంటూరు‌లోని ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రెయిన్ ట్రీపార్కులో వసతి కల్పించారు.

మూడు బెడ్ రూమ్ ఫ్లాట్‌లలో ఆరుగురు ఉద్యోగినులు, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నలుగురు చొప్పున ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిస్థితిని అంచనా వేసి ఫ్లాట్ల లీజు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆగస్టు 1 2020తో ముగిసిన వసతి సౌకర్యాన్ని 2021 జూన్ 31 వరకు పొడిగించింది.

Tags:    

Similar News