వాహనదారులకు జగన్ గుడ్‌న్యూస్..
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో రోడ్ టాక్స్ కట్టేందుకు గతంలో ఇచ్చిన సమయం నేటితో ముగియనుంది. కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా వాహనాలు రోడ్డెక్కని పరిస్థితి. దీంతో వాహనదారులు తమ గోడును మంత్రి పేర్ని నానితో చెప్పుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. రోడ్ టాక్స్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం దీనికి […]
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో రోడ్ టాక్స్ కట్టేందుకు గతంలో ఇచ్చిన సమయం నేటితో ముగియనుంది. కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా వాహనాలు రోడ్డెక్కని పరిస్థితి. దీంతో వాహనదారులు తమ గోడును మంత్రి పేర్ని నానితో చెప్పుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. రోడ్ టాక్స్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
లాక్ డౌన్ సమయంలో మోటార్ వాహనాల టాక్స్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రేస్ పీరియడ్‌ను ఏప్రిల్ 30 నుంచి జూన్ 30 వరకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి కారణంగా వాహనాలు రోడ్డెక్కడం లేదు. ఈ నేపథ్యంలో మరోమారు పన్ను చెల్లింపులకు సంబంధించిన గడువును పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.