ఏప్రిల్ నెల జీతాలపై ఏపీ ప్రభుత్వం స్పష్టత!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తితో పాటు, లాక్‌డౌన్ మే 3 వరకూ కొనసాగనున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే ఏప్రిల్ నెల జీతాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తీస్థాయి జీతాలు, మిగిలిన ఉద్యొగులందరికీ మార్చి నెల మాదిరిగానే సగం జీతాలు ఇవ్వనున్నట్టు నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు. జీతాల కోత నుంచి ఫించనుదారులకు మినహాయింపు ఇచ్చారు. మార్చి నెలలో ఫించనుదారుల జీతాల్లో కూడా సగం […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తితో పాటు, లాక్‌డౌన్ మే 3 వరకూ కొనసాగనున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే ఏప్రిల్ నెల జీతాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తీస్థాయి జీతాలు, మిగిలిన ఉద్యొగులందరికీ మార్చి నెల మాదిరిగానే సగం జీతాలు ఇవ్వనున్నట్టు నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు. జీతాల కోత నుంచి ఫించనుదారులకు మినహాయింపు ఇచ్చారు. మార్చి నెలలో ఫించనుదారుల జీతాల్లో కూడా సగం కోత విధించిన తర్వాత ఈ నెల వంద శాతం జీతమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, సచివాలయ ఉద్యోగులకు సైతం పూర్తీ జీతమివ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Tags : ap government, employees, april salaries, covid-19, coronavirus