హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం..!

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ బాబు, చైర్మన్ సీతారాం మోహన్‎పై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత మంగళవారం డాక్టర్ రమేష్‎తో పాటు ఆస్పత్రి చైర్మన్‎పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు.. […]

Update: 2020-09-01 09:28 GMT

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ బాబు, చైర్మన్ సీతారాం మోహన్‎పై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత మంగళవారం డాక్టర్ రమేష్‎తో పాటు ఆస్పత్రి చైర్మన్‎పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్వర్ణ ప్యాలెస్‎ను క్వారంటైన్ సెంటర్‎గా అనుమతిచ్చిన అధికారులను ఎందుకు బాధ్యులను చేయలేదని ప్రశ్నించింది. ఈ ఘటనలో అధికారులు తప్పు కూడా ఉందని.. దీనికి వారు కూడా బాధ్యులేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 9వ తేదీన విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‎లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News