బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో కర్ఫ్యూ సడలింపు

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. ఇకపై అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్‌ ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి కట్టడిపై మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ […]

Update: 2021-07-12 02:45 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. ఇకపై అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్‌ ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి కట్టడిపై మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఇచ్చారు. రాత్రి 9 గంటలకు దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News