ఎయిర్ పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనసరి
దిశ,వెబ్‌డెస్క్: ఏయిర్ పోర్ట్‌ల్లో ఆర్‌టీపీసీఆర్ టెస్టులు తప్పని సరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో ఏపీలో కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర సూచనలతో ఏపీ సర్కార్ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎయిర్ పోర్టు అధికారులతో ఆయా జిల్లాల అధికారులు సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. పాజిటివ్ […]
దిశ,వెబ్‌డెస్క్: ఏయిర్ పోర్ట్‌ల్లో ఆర్‌టీపీసీఆర్ టెస్టులు తప్పని సరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో ఏపీలో కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర సూచనలతో ఏపీ సర్కార్ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎయిర్ పోర్టు అధికారులతో ఆయా జిల్లాల అధికారులు సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. పాజిటివ్ అని తేలితే స్పెషల్ అంబులెన్స్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. నెగిటివ్ అని తేలినా 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల వివరాలను సేకరించాలని ప్రభుత్వం పేర్కొంది.