కరోనా కట్టడిలో ఏపీ పూర్తిగా విఫలం: పవన్ కల్యాణ్
కరోనా వైరస్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల వృద్ధి నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వంతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయని అన్నారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ, దానిని కట్డడి చేయడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు బాధ్యతారాహిత్యంతో ర్యాలీలు, […]
కరోనా వైరస్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల వృద్ధి నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వంతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయని అన్నారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ, దానిని కట్డడి చేయడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు బాధ్యతారాహిత్యంతో ర్యాలీలు, సమావేశాలు చేపట్టడమే కరోనా వ్యాప్తికి కారణమని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే… ఏపీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోయిందని ఆయన స్పష్టం చేశారు.
Tags: corona positive, covid-19, janasena, bjp, ap, video conference, pawankalyan