ఇంగ్లీష్ మీడియంపై అవసరమైతే సుప్రీంకోర్టు కెళ్తాం: ఆదిమూలపు సురేష్

1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలన్నిట్లో ఆంగ్ల మాధ్యామన్ని తప్పనిసరి చేస్త గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. దీనిపై పోరాటానికి అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85 లను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ, హైకోర్టు […]

Update: 2020-04-16 01:06 GMT

1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలన్నిట్లో ఆంగ్ల మాధ్యామన్ని తప్పనిసరి చేస్త గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. దీనిపై పోరాటానికి అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85 లను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు పూర్తి పాఠం వచ్చిన తరువాత న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

హైకోర్టు తీర్పును విజయంగానో లేక పరాజయంలానో చూడడం లేదని అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోకూడదన్న ఆలోచనతో టీడీపీ దీనిపై విమర్శలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల పిల్లలంతా ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలన్న గొప్ప లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి జీవో 81,85ను జారీ చేశారని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం పలు రాజ్యాంగపరమైన చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుకోవాలన్నది వారి తల్లిదండ్రుల ఇష్టమేనని ఆయన అన్నారు. తెలుగులో చదువుకుంటామన్న వారి అభీష్టానికి అనుగుణంగా ప్రతి మండలంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

అన్ని జిల్లాల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు జరిపి, 90 శాతం మంది తల్లిదండ్రుల అభీష్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. వైజ్ఞానిక, కంప్యూటర్ పరిజ్ఞానం తెలియాలంటే ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి ఆయన గుర్తుచేశారు. బడుగు బలహీన వర్గాలు వెనకబడడానికి ప్రధానం కారణం భాషా పరిజ్ఞానం లేకపోవడమేనని, బడుగు బలహీన వర్గాలు దానిని నేర్చుకుంటే ఇతరుల కంటే ముందుంటారన్న అక్కసుతోనే టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.

Tags: ysrcp, education minister, andhra pradesh, high court verdict, english medium, adimulapu suresh

Tags:    

Similar News