ఏపీలో ఎంసెట్ పరీక్షల షెడ్యుల్ విడుదల..

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ పరీక్షల షెడ్యుల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. అయితే ఈసారి ఎంసెట్‌కు బదులుగా ఈప్‌సెట్(EAPCET) నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఈప్ సెట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల […]

Update: 2021-06-19 01:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ పరీక్షల షెడ్యుల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. అయితే ఈసారి ఎంసెట్‌కు బదులుగా ఈప్‌సెట్(EAPCET) నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఈప్ సెట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూలై 25వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు మంత్రి వెల్లడించారు.

 

Tags:    

Similar News