ఏపీ పోలీసులను చూసి గర్విస్తున్నా : డీజీపీ
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ గౌతం సవాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఎలా నిర్వహించాలో పోలీసు, ఉద్యోగ సంఘాలతో చర్చించామని అన్నారు. అంతేగాకుండా పోలీసులకు వ్యాక్సినేషన్ చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించారు. సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో సెంటర్లు, ఓటర్లు ఎక్కువ అని అన్నారు. ఎన్నికల విధుల కోసం పోలీసులు వ్యాక్సినేషన్‌ను త్యాగం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పోలీసులు తీసుకున్న […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ గౌతం సవాంగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఎలా నిర్వహించాలో పోలీసు, ఉద్యోగ సంఘాలతో చర్చించామని అన్నారు. అంతేగాకుండా పోలీసులకు వ్యాక్సినేషన్ చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ జరుగుతుందని వెల్లడించారు. సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో సెంటర్లు, ఓటర్లు ఎక్కువ అని అన్నారు. ఎన్నికల విధుల కోసం పోలీసులు వ్యాక్సినేషన్‌ను త్యాగం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పోలీసులు తీసుకున్న నిర్ణయానికి నేను గర్విస్తున్నానని అన్నారు. కాగా, నిమ్మాడ కేసులో పోలీసులపై వచ్చివని ఆరోపణలు మాత్రమే అని స్పష్టం చేశారు. టెక్కలిలో సీఐపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశామని అన్నారు.