ఉన్మాద చర్యలను.. ఉపేక్షించేది లేదు
దిశ, వెబ్‌డెస్క్: బెజవాడ ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన దివ్య తేజస్విని ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీపీ స్వియ పర్యవేక్షణలో జరిగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లోనే ఛార్జీషీట్ దాఖలు చేస్తామని అన్నారు. సమాజంలో జరుగుతున్న ఇలాంటి […]
దిశ, వెబ్‌డెస్క్: బెజవాడ ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన దివ్య తేజస్విని ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అన్నారు. చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీపీ స్వియ పర్యవేక్షణలో జరిగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. దిశ స్ఫూర్తిగా ఏడు రోజుల్లోనే ఛార్జీషీట్ దాఖలు చేస్తామని అన్నారు. సమాజంలో జరుగుతున్న ఇలాంటి వింత పోకడలను వెంటనే అరికట్టాలని వెల్లడించారు. అంతేగాకుండా మృతురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.