'జగన్ సర్కార్‌ను అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర'

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఓ మతత్వ పార్టీ అని.. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే సీఎం జగన్‌పై బీజేపీ బురదజల్లడం, ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదుల చేయడమని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ క్యాడర్ లేదన్నారు. ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటు అంశంపై బీజేపీ రాజకీయం చేస్తోందంటూ […]

Update: 2021-08-08 03:54 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఓ మతత్వ పార్టీ అని.. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే సీఎం జగన్‌పై బీజేపీ బురదజల్లడం, ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదుల చేయడమని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ క్యాడర్ లేదన్నారు.

ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటు అంశంపై బీజేపీ రాజకీయం చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రభుత్వ అనుమతితో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే రుణాలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు అందించడంలో ఉదారంగా వ్యవహరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అంజాద్‌బాషా సూచించారు

Tags:    

Similar News