టెన్త్ క్లాస్‌ ఆల్ పాస్‌పై ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం..

దిశ, ఏపీ బ్యూరో: పదో తరగతి పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేక ప్రభుత్వం విద్యార్థులందరిని ఉత్తీర్ణులుగా ప్రకటించింది. అయితే ఆల్ పాస్ అని కాకుండా విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా గ్రేడ్లు ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు రాసిన సమ్మేటివ్, ఫార్మేటివ్‌ పరీక్షల మార్కుల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఛాయారతన్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి […]

Update: 2021-07-12 02:55 GMT

దిశ, ఏపీ బ్యూరో: పదో తరగతి పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేక ప్రభుత్వం విద్యార్థులందరిని ఉత్తీర్ణులుగా ప్రకటించింది. అయితే ఆల్ పాస్ అని కాకుండా విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా గ్రేడ్లు ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు రాసిన సమ్మేటివ్, ఫార్మేటివ్‌ పరీక్షల మార్కుల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఛాయారతన్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ చర్చించింది.

2019-20 విద్యార్థులకు ఫార్మేటివ్‌-1, ఫార్మేటివ్‌-2, ఫార్మేటివ్‌-3, సమ్మేటివ్‌-1 పరీక్షలు జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని వారికి ఇప్పుడు గ్రేడ్లు ఇవ్వాలని అత్యున్నత స్థాయి కమిటీ తీర్మానించింది. ఒక్కో ఫార్మేటివ్‌ పరీక్షకు 20 మార్కులు చొప్పున 60 మార్కులుగా, సమ్మేటివ్‌ పరీక్షకు 40 మార్కులుగా పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ఇవ్వనున్నారు. అయితే 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు కేవలం 2 ఫార్మేటివ్‌ పరీక్షలు మాత్రమే జరిగాయి. ఆయా విద్యార్థులు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని పదో తరగతి ఫలితాలు ప్రకటించాలన్న అంశంపై కమిటీ దృష్టి సారించింది. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఫార్మేటివ్‌ 1, ఫార్మేటివ్‌ 2 పరీక్షలు జరిగాయి. ఈ ఫార్మేటివ్‌ పరీక్షలు ఒక్కో దానికి 50 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులను గ్రేడ్ల కోసం పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇందులో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల మార్కులను సగటుగా తీసుకొని గ్రేడింగ్‌ ఇస్తారు.

Tags:    

Similar News