ఏపీలో కొత్తగా 25 కేసులు నమోదు!

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,880 మంది నమూనాలను పరీక్షించగా కొత్తగా 25 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,230కి చేరుకుంది. కరోనా వైరస్‌తో 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందడంతో.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. 24 గంటల్లో […]

Update: 2020-05-17 08:36 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,880 మంది నమూనాలను పరీక్షించగా కొత్తగా 25 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,230కి చేరుకుంది. కరోనా వైరస్‌తో 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందడంతో.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 50కి చేరింది. 24 గంటల్లో 103 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1, 433కి చేరింది. ప్రస్తుతం పలు కొవిడ్‌ ఆసుపత్రుల్లో 747 మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం నమోదైన కేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఏడు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్యను వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పత్యేకంగా వెల్లడించింది.

Tags:    

Similar News