ఏపీలో కరోనా కేసులెన్నంటే..?
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా 23,920 కరోనా కేసులు రాగా 83 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. 21 శాతం పాజిటివిటీ రేట్, 1.35 మరణాల శాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ బెడ్లు కూడా తగ్గుతూ వస్తున్నాయన్నారు. అనుమతులు లేకుండా కొవిడ్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా 23,920 కరోనా కేసులు రాగా 83 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. 21 శాతం పాజిటివిటీ రేట్, 1.35 మరణాల శాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ బెడ్లు కూడా తగ్గుతూ వస్తున్నాయన్నారు.
అనుమతులు లేకుండా కొవిడ్ ట్రీట్‌మెంట్ చేస్తే, కొవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనుమతులు ఉంటే ఆక్సిజన్, రెమిడెసివిర్ సులువుగా అందుతుందన్నారు. ఇప్పటివరకు 11,45,022 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,136 మంది మృతి చెందారు. 9,93,708 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్‌గా 1,43,178 కేసులు ఉన్నట్లు వెల్లడించారు.