ఏపీలో కరోనా రికార్డ్స్ బ్రేక్.. కొత్తగా ఎన్నికేసులంటే!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ పాత రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 19,412 కేసులు నమోదు కాగా 61 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో పాజిటివిటీ రేటు 14 శాతంగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 98,214 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. కొవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. […]

Update: 2021-05-01 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ పాత రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 19,412 కేసులు నమోదు కాగా 61 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో పాజిటివిటీ రేటు 14 శాతంగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 98,214 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిల్ సింఘాల్ పేర్కొన్నారు.

కొవిడ్ రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 17,382 రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ఆస్పత్రులకు సరఫరా చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

Tags:    

Similar News