ఏపీలో రికార్డు స్థాయి కరోనా కేసులు..
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గంటల వ్యవధిలోనే అక్కడ రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 11,766 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, ఒక్కరోజులోనే 38 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. 24 గంటల్లో 45,581 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరు 1885, గుంటూరు 1593, అనంతపురం 1201, కర్నూలు 1180, శ్రీకాకుళం […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గంటల వ్యవధిలోనే అక్కడ రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 11,766 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, ఒక్కరోజులోనే 38 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. 24 గంటల్లో 45,581 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరు 1885, గుంటూరు 1593, అనంతపురం 1201, కర్నూలు 1180, శ్రీకాకుళం 1052, నెల్లూరు 949, విశాఖ 910, కృష్ణా 831, తూగో 796, విజయనగరం 448, ప్రకాశం 370, కడప 361, పశ్చిమగోదావరి 190 కేసులు నమోదయ్యాయి. మరణాల వారీగా చూసుకుంటే.. నెల్లూరులో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున మృతి చెందగా, విశాఖలో ముగ్గురు, గుంటూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు తెలుస్తోంది. తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,06,333 చేరగా, యాక్టివ్ కేసులు 74,231, మొత్తం మరణాలు 7,579 సంభవించినట్లు శుక్రవారం హెల్త్ బులెటిన్ పేర్కొంది.