ఏపీలో సగానికి తగ్గిన కరోనా కేసులు..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు సగానికి పడిపోయాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,413 కరోనా కేసులు వెలుగుచూడగా, 83 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,33,773 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 11,296 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి చెందగా, పశ్చిమ గోదావరిలో 11, అనంతపురంలో 8 […]

Update: 2021-06-04 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు సగానికి పడిపోయాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,413 కరోనా కేసులు వెలుగుచూడగా, 83 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,33,773 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 11,296 మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి చెందగా, పశ్చిమ గోదావరిలో 11, అనంతపురంలో 8 చొప్పున మరణాలు సంభవించినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.

Tags:    

Similar News