పీవీ వివేకవంతుడైన రాజకీయవేత్త: జగన్
దిశ ఏపీ బ్యూరో: యావత్ భారత జాతిని ఆర్థిక స్వేచ్ఛ వైపు నడిపిన ధీశాలి దివంగత ప్రధాని, తెలుగుజాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు అంటూ ఆయన శతజయంతి వేడుక సందర్భంగా ఏపీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన.. పీవీ వివేకవంతుడైన రాజకీయవేత్తగా మంచి పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. బహుభాషా కోవిదుడైన పీవీ దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచారన్నారు. భారతజాతిని ఆర్థిక స్వేచ్ఛగా నడిపించిన వ్యక్తి అని కొనియాడారు. దేశాన్ని పురోభివృద్ధి […]
దిశ ఏపీ బ్యూరో: యావత్ భారత జాతిని ఆర్థిక స్వేచ్ఛ వైపు నడిపిన ధీశాలి దివంగత ప్రధాని, తెలుగుజాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు అంటూ ఆయన శతజయంతి వేడుక సందర్భంగా ఏపీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన.. పీవీ వివేకవంతుడైన రాజకీయవేత్తగా మంచి పేరుతెచ్చుకున్నారని కొనియాడారు. బహుభాషా కోవిదుడైన పీవీ దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచారన్నారు. భారతజాతిని ఆర్థిక స్వేచ్ఛగా నడిపించిన వ్యక్తి అని కొనియాడారు. దేశాన్ని పురోభివృద్ధి దిశగా నడిపించే క్రమంలో ఆయన అందించిన సేవలను భావి తరాలు కూడా గుర్తుంచుకుంటాయని ఆకాంక్షించారు.