కడపలో రెండ్రోజుల పర్యటనకు బయలుదేరిన సీఎం.. ఇడుపుల పాయలో బస

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేశ్, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,స్ధానిక ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. హెలీప్యాడ్ వద్ద పులివెందుల మున్సిపల్‌ […]

Update: 2021-09-01 12:09 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఇన్‌చార్జ్‌ మంత్రి ఆదిమూలపు సురేశ్, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,స్ధానిక ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. హెలీప్యాడ్ వద్ద పులివెందుల మున్సిపల్‌ చైర్మన్, కౌన్సిలర్లు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ప్రజలతో భేటీ అయ్యారు. స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో సీఎం జగన్‌కు జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్ ఎమ్మెల్యే లు రవీంద్రనాధ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

నేడు వైఎస్ఆర్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. గురువారం ఉదయం తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఉదయం 9.30కి గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి 9.30 నుంచి 10.05 వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. 10.15 నుంచి పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు. 11 గంటలకు బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో 11.30కు బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. 12.45కు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళతారు.

Tags:    

Similar News