విశాఖ నుంచే జగన్ పాలన.. ముహూర్తం ఎప్పుడంటే..!

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పాలనా వ్యవహారాలు చూస్తున్న జగన్ వీలైనంత త్వరగా విశాఖకు తరలి వెళ్లాలని భావిస్తున్నారట. అన్నీ కుదిరితే జూన్ నెల నుంచి పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం నుంచే పాలనను అందించనున్నట్లు తెలుస్తోంది. జూన్ కల్లా పాలన వ్యవహారాలు అంతా విశాఖ నుంచే చేపడతారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. విశాఖలో […]

Update: 2021-03-04 06:37 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పాలనా వ్యవహారాలు చూస్తున్న జగన్ వీలైనంత త్వరగా విశాఖకు తరలి వెళ్లాలని భావిస్తున్నారట. అన్నీ కుదిరితే జూన్ నెల నుంచి పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం నుంచే పాలనను అందించనున్నట్లు తెలుస్తోంది. జూన్ కల్లా పాలన వ్యవహారాలు అంతా విశాఖ నుంచే చేపడతారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

విశాఖలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు సైతం పూర్తవుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిని కాకుండా విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులను సైతం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. న్యాయ సమస్యల వల్ల రాజధాని తరలింపు ఆలస్యమైనా జగన్ మాత్రం వైజాగ్ నుంచి పాల‌న చేయ‌డానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వ భవనాలు పూర్తిగా సమకూరే వరకు.. పాలనకు ఇబ్బంది లేకుండా.. అంతా అనుకూలంగా ఉండే ప్లేస్ ను ఆయన ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు జూన్ మొద‌టి వారంలో కీల‌క పాల‌నా విభాగ‌మంత విశాఖ‌ప‌ట్నం వెళ్లడానికి రెడీ అవుతోందట. ఇదిలా ఉంటే ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సీఎం జగన్ ఉగాది రోజున శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నగరంలో ఉన్న ప్రముఖ వెల్ నెస్ రిసార్ట్ ను క్యాంపు కార్యాలయంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

సుమారు 28 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వెల్ నెస్ రిసార్ట్ ప్రభుత్వ స్థలంలో ఉండటంతో దాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని చూస్తు్న్నట్లు సమాచారం. మూడు రాజధానులు ప్రకటించినప్పటి నుంచే అమరావతిలో జగన్ కు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అయినప్పటికీ జగన్ వెనకడుగు వేయడం లేదు. మూడు రాజధానులకే మెుగ్గు చూపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News