జలకళ పథకాన్ని ప్రారంభించిన జగన్
దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వైఎస్సార్ జలకళ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చిన్న, సన్నకారు రైతులకు బోర్లతో పాటు మోటార్లు వేయించడానికి 2,340కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు ఎటువంటి సరఫరా లోపాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడానికే మోటార్లు బిగిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు బిగిస్తామన్నారు. గత ప్రభుత్వ బకాయిలను వైసీపీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ఉచిత విద్యుత్‌పై […]
దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వైఎస్సార్ జలకళ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చిన్న, సన్నకారు రైతులకు బోర్లతో పాటు మోటార్లు వేయించడానికి 2,340కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. రైతులకు ఎటువంటి సరఫరా లోపాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడానికే మోటార్లు బిగిస్తున్నట్లు తెలిపారు.
అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు బిగిస్తామన్నారు. గత ప్రభుత్వ బకాయిలను వైసీపీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ఉచిత విద్యుత్‌పై అబద్ధాలు చెప్పేవారిని ప్రశ్నించాలన్నారు. మోటార్లపై చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు.