28న జగన్‌కు స్పెషల్ డే.. ఐదు రోజుల ఫ్యామిలీ ట్రిప్.
దిశ ఏపీ బ్యూరో : పాద యాత్ర మొదలు పెట్టిన దగ్గరి నుంచి ఎన్నికల వరకూ రోజూ బిజీగా గడిపిన ఏపీ సీఎం కు ఇప్పుడు కాస్త టైం దొరికింది. ఎన్నికల్లో విజయం దక్కిన దగ్గరి నుంచి ప్రజా సంక్షేమంలో మునిగి పోయిన జగన్ కు ఇప్పుడు విదేశాలకు ఫ్యామిలీ తో వెళ్లడానికి సిద్దం అయ్యారు. అంతే కాకుండా తన పెళ్లి జరిగి ఈ నెల 28 తేదీకి సరిగ్గా పాతిక సంవత్సరాలు కానున్న నేపథ్యంలో ఈ […]
దిశ ఏపీ బ్యూరో : పాద యాత్ర మొదలు పెట్టిన దగ్గరి నుంచి ఎన్నికల వరకూ రోజూ బిజీగా గడిపిన ఏపీ సీఎం కు ఇప్పుడు కాస్త టైం దొరికింది. ఎన్నికల్లో విజయం దక్కిన దగ్గరి నుంచి ప్రజా సంక్షేమంలో మునిగి పోయిన జగన్ కు ఇప్పుడు విదేశాలకు ఫ్యామిలీ తో వెళ్లడానికి సిద్దం అయ్యారు. అంతే కాకుండా తన పెళ్లి జరిగి ఈ నెల 28 తేదీకి సరిగ్గా పాతిక సంవత్సరాలు కానున్న నేపథ్యంలో ఈ సారి పెళ్లి రోజును స్పెషల్ గా ప్లాన్ చేయనున్నారు. రాజకీయాల్లో బిజీ గా కాలం గడుస్తుండటంతో కాస్త తన కుటుంబంతో గడపాలని విదేశాలకు పయనం అయ్యారు.
తన కూతుర్లను అమెరికాలో చేర్పించినప్పుడు తప్పా, ఇంతవరకూ వాళ్లను కలవలేదు. అందుకే ఈ పెళ్లి రోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి జగన్ విదేశాలకు పయనం అయ్యారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటూ విదేశాలలో గడపడానికి ఏపీ సీఎం సిద్దమయ్యారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు సిమ్లాకు చేరుకుంటారు.