కరోనాను కట్టడి చేయలేకపోతున్నాం : జగన్

దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు ఏపీలోనే చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. పది లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ తొమ్మిది ల్యాబ్‌లలో 74,551 మందికి టెస్టులు చేశామని స్పష్టం చేశారు. ఇప్పటికే రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్‌లను గుర్తించామని, దాదాపు 63 మండలాలు రెడ్‌జోన్‌లో, 54 మండలాలు ఆరేంజ్ జోన్‌లో, 559 మండలాలు గ్రీజ్‌జోన్‌లో ఉన్నాయన్నారు. ఏపీలో 80 మండలాల్లో కరోనా లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. మే […]

Update: 2020-04-27 19:37 GMT

దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు ఏపీలోనే చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. పది లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ తొమ్మిది ల్యాబ్‌లలో 74,551 మందికి టెస్టులు చేశామని స్పష్టం చేశారు. ఇప్పటికే రెడ్, ఆరేంజ్, గ్రీన్ జోన్‌లను గుర్తించామని, దాదాపు 63 మండలాలు రెడ్‌జోన్‌లో, 54 మండలాలు ఆరేంజ్ జోన్‌లో, 559 మండలాలు గ్రీజ్‌జోన్‌లో ఉన్నాయన్నారు. ఏపీలో 80 మండలాల్లో కరోనా లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. మే 15 నాటికి అన్ని ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. టెలీ మెడిసిన్ ద్వారా అందరికీ వైద్యం అందిస్తున్నామని, మందులు కూడా డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లతో వ్యవస్థలను పటిష్టం చేశామని తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో ప్రొటెక్షన్ కిట్లు, మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. అందరికీ రేషన్ కూడా సరైన సమయంలో అందిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కష్టాల్లోనూ 56 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఇంత కష్టపడి ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా కరోనాను కట్టడిచేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా అంటరానితనం కాదని, ఈ వ్యాధి భవిష్యత్తులో అందరికీ రావొచ్చని, జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చని సీఎం జగన్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పోలీస్, పారిశుధ్య, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా దరిచేరకుండా చిన్నా, పెద్దలు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Tags: AP CM jagan, Press Meet, coronavirus, red zones, hospitals, labs

Tags:    

Similar News