కేంద్రానికి సీఎం జగన్ లేఖ.. కారణం ఇదే!
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి ఓ లేఖను రాశారు. గతేడాది నవంబర్‌లో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. జూన్ 30న రిటైరయ్యారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా సాహ్ని సేవలు తమకు చాలా అవసరమని, ఆమె పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని జగన్ […]
దిశ, వెబ్ డెస్క్ :
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి ఓ లేఖను రాశారు. గతేడాది నవంబర్‌లో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. జూన్ 30న రిటైరయ్యారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా సాహ్ని సేవలు తమకు చాలా అవసరమని, ఆమె పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని జగన్ సర్కార్, కేంద్రాన్ని కోరింది.
కానీ కేంద్రం 3నెలలు మాత్రమే పొడిగించగా.. సెప్టెంబర్‌తో ఆమె పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో మరోసారి ఆమె పదవీకాలాన్ని పొడిగించాలని జగన్ కేంద్రాన్ని కోరారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతిని ఇస్తే డిసెంబర్ వరకు నీలం సాహ్ని ఏపీ సీఎస్‌గా కొనసాగే అవకాశం ఉంది.
కాగా, 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ సేవలు అందించారు. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా, నల్గొండ జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా పనిచేశారు. ముస్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, శిశు సంక్షేమశాఖ పీడీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.