ప్రధానికి బాసటగా సీఎం జగన్.. జార్ఖండ్ సీఎం ట్వీట్‌కు స్ట్రాంగ్ కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ఉధృతికి, రోజువారీగా లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడానికి కేంద్రం అమలు చేస్తున్న విధానాలు, ప్రధాని మోడీ చేతగానితనమే కారణమని పలు విమర్శలు వస్తున్నాయి. ప్రజలతో పాటు విపక్షాలు, బీజేపీ యేతర పార్టీల నాయకులు సైతం కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి […]

Update: 2021-05-07 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ ఉధృతికి, రోజువారీగా లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడానికి కేంద్రం అమలు చేస్తున్న విధానాలు, ప్రధాని మోడీ చేతగానితనమే కారణమని పలు విమర్శలు వస్తున్నాయి. ప్రజలతో పాటు విపక్షాలు, బీజేపీ యేతర పార్టీల నాయకులు సైతం కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ.. దేశమంతటా కొవిడ్‌పై యుద్ధం చేస్తున్న సమయంలో విమర్శలు సరికాదన్నారు. సీఎం హేమంత్ సోరేన్ ట్వీట్‌ను ముఖ్యమంత్రి జగన్ రీ ట్వీట్ చేశారు. బ్రదర్ అంటూనే.. రాజకీయ విమర్శలు జాతీయతను బలహీన పరుస్తాయని జగన్ సూచించారు. అందరం కలిసి ప్రధానికి మరింత అండగా నిలవాలని హేమంత్ సోరేన్‌ను జగన్ కోరారు.

అంతకుముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మధ్యలో జరిగిన సంభాషణ గురించి ట్వీట్ చేశారు. ఈ రోజు తనకు ప్రధాన మంత్రి కాల్ చేశారని, తన మనసులోని భావాల గురించి పంచుకున్నారని చెప్పారు. దానికి బదులు కరోనా సమయంలో పనికొచ్చే మాటలు చెప్పడం గానీ, వినడం గానీ చేస్తే బాగుండేదని సీఎం సోరెన్ ప్రధాని మోడీని విమర్శించారు.

Tags:    

Similar News