అప్పటివరకు మనం జాగ్రత్తగా ఉండాలి..ఇదీ వాస్తవ పరిస్థితి :జగన్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కరోనా పరిస్థతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్ కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారం కాదన్నారు. దేశంలో వ్యాక్సిన్ సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా అందులో కోటి వ్యాక్సిన్లు కోవాగ్జిన్, మిగిలినవి కొవిషీల్డ్ తయారు చేస్తున్నారన్నారు. దేశంలో 45 ఏళ్లు పైబడినవారు 26 కోట్ల మంది ఉన్నారని, 4 వారాల వ్యవధిలో రెండో డోసు ఇవ్వాలని, ఆ […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కరోనా పరిస్థతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్ కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారం కాదన్నారు. దేశంలో వ్యాక్సిన్ సామర్థ్యం నెలకు 7 కోట్లు కాగా అందులో కోటి వ్యాక్సిన్లు కోవాగ్జిన్, మిగిలినవి కొవిషీల్డ్ తయారు చేస్తున్నారన్నారు. దేశంలో 45 ఏళ్లు పైబడినవారు 26 కోట్ల మంది ఉన్నారని, 4 వారాల వ్యవధిలో రెండో డోసు ఇవ్వాలని, ఆ మేరకు 52 కోట్ల వ్యాక్సిన్లు కావాలన్నారు.
తొలి డోసు ఇప్పటివరకు కేవలం 12 కోట్ల మందికి, రెండో రోజు 2.6 కోట్ల మందికి మాత్రమే వేశారని గుర్తుచేశారు. మొత్తం కలిసి చూసినా ఇప్పటివరకు కొవిడ్ వ్యాక్సిన్ డోసులు 15 కోట్లు మాత్రమేనని, ఇంకా 39కోట్ల వ్యాక్సిన్ డోసులు కావాలన్నారు. 39 కోట్ల వ్యాక్సిన్ల డిమాండ్ ఆగస్టు, సెప్టెంబర్ వరకు పూర్తి కాదన్నారు. 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు వాళ్లు 60 కోట్ల మంది ఉన్నారని, ఈ మేరకు 120 కోట్ల వ్యాక్సిన్ లు అవసరమన్నారు. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే, సెప్టెంబర్ నుంచి 18-45 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ పూర్తికావడానికి 4 నెలలు పడుతుందని జగన్ తెలిపారు. వచ్చే జనవరి నాటికి అందరికీ వ్యాక్సినేషన్ చేయగలుగుతాం.. ఇదీ వాస్తవ పరిస్థితి అని జగన్ వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరి వరకు మనం జాగ్రత్తగా ఉండాలని, శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.