ఆ భావన పిల్లల్లో కలగాలి : సీఎస్

దిశ, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా సీతంపేట మండల కేంద్రంలో గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. గురుకుల పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలల కంటే అధిక స్థాయిలో ఉన్నామన్న భావన పిల్లల్లో కలగాలని, అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడిన ప్రాంతాల్లో ముందుగా ప్రారంభం కావాలన్నారు. అన్ని పాఠశాలల్లో నాడు- నేడు ఫొటోలు ఉండాలని సూచించారు. అనంతరం రేగిడి […]

Update: 2020-11-09 12:15 GMT

దిశ, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా సీతంపేట మండల కేంద్రంలో గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు. గురుకుల పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలల కంటే అధిక స్థాయిలో ఉన్నామన్న భావన పిల్లల్లో కలగాలని, అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడిన ప్రాంతాల్లో ముందుగా ప్రారంభం కావాలన్నారు. అన్ని పాఠశాలల్లో నాడు- నేడు ఫొటోలు ఉండాలని సూచించారు. అనంతరం రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకూ పూర్తి చేసుకున్న సిలబస్‌ను పరిశీలించారు.

ప్రజలు చెల్లించిన పన్నులతో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తుండటంతో వాటిని పక్కాగా సద్వినియోగం చేయాలన్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు అమలులో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దేశంలో క్రమశిక్షణ గల రాష్ట్రాలుగా ఆంధ్ర, తమిళనాడుకు మంచి పేరుందని, దానిని నిలబెట్టాలని సూచించారు. గత నెల 6వ తేదీన జగనన్న విద్యాకానుక పంపిణీ చేయగా ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News