నిర్లక్ష్యం వీడండి.. అధికారులకు సీఎం జగన్ వార్నింగ్

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ సందర్శనలపై ఆరా తియ్యగా కొందరు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం జగన్ వారి తీరుపై మండిపడ్డారు. ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా […]

Update: 2021-07-27 05:01 GMT

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ సందర్శనలపై ఆరా తియ్యగా కొందరు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో సీఎం జగన్ వారి తీరుపై మండిపడ్డారు. ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని జగన్ ప్రశ్నించారు. కలెక్టర్లు, జేసీల స్థాయిలో పర్యవేక్షణ బాగుందని కొనియాడారు. అధికారులు పేదల పట్ల మానవత్వం చూపించాలని సీఎం జగన్‌ సూచించారు.

Tags:    

Similar News