ఆగస్టు 6న ఏపీ కేబినెట్ భేటీ
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఆగస్టు 6న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొవిడ్ నియంత్రణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, క్లీన్ ఏపీ, కొవిడ్ రాకుండా జాగ్రత్తలు, వచ్చిన తర్వాత జరిగే పరిణామాలపై పూర్తి అధ్యయనం చేసేందుకు కమిటీని నియామకం కోసం చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఆగస్టు 6న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొవిడ్ నియంత్రణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, క్లీన్ ఏపీ, కొవిడ్ రాకుండా జాగ్రత్తలు, వచ్చిన తర్వాత జరిగే పరిణామాలపై పూర్తి అధ్యయనం చేసేందుకు కమిటీని నియామకం కోసం చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జల వివాదం వంటి అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది.
అలాగే జగనన్న కాలనీలకు సంబంధించి ఆగస్టు నెలలో నిర్మాణం చేపట్టే 3లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. దిశా బిల్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేదల ఇళ్లపట్టాల క్రమబద్దీకరణ, నూతన ఐటీ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం చర్చించే అవకాశం ఉంది. అదే సమావేశంలో జాబ్ క్యాలెండర్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం జగన్ విడుదల చేసిన జాబ్‌క్యాలెండర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగులు, యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాబ్‌క్యాలెండర్‌లో మార్పులు చేర్పులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.