నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పీవీ సింధుకు ప్రోత్సహకాలు.?

దిశ, వెబ్‌డెస్క్ : శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సుమారు 3 గంటల పాటు జరిగే ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్ భేటీలో ముందుగా.. టోక్యో ఒలంపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధుకు అభినందనలు తెలియజేయనున్నది. అనంతరం పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం ఏం చేయాలి..? ఎలాంటి ప్రోత్సాహకాలు […]

Update: 2021-08-05 21:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. సుమారు 3 గంటల పాటు జరిగే ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

కేబినెట్ భేటీలో ముందుగా.. టోక్యో ఒలంపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధుకు అభినందనలు తెలియజేయనున్నది. అనంతరం పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం ఏం చేయాలి..? ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాలి..? అనే విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై కేబినెట్ చర్చించనున్నది. వీటితో పాటు తక్కువ పరిహారం అందుకున్న పోలవరం నిర్వాసితులకు పరిహారం పెంచి ఇచ్చే అంశంపైనా చర్చించనున్నారు. ఆర్ అండ్‌ బీకి చెందిన 4వేల కోట్ల ఆస్తులను ఏపీఎస్ఆర్టీసీకి బదలాయించే అంశంపై కేబినెట్‌లో ప్రతిపాదించే అవకాశం ఉంది.

అంతే కాకుండా ‘నాడు-నేడు’ రెండో దశ పనులు ఆగస్ట్-16న ప్రారంభం కానుండడంతో వాటికి కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశముంది. కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధతపై చర్చ, ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తున్న కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది.

Tags:    

Similar News