25 జిల్లాలకు టార్గెట్ మార్చి 31

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీలో సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ […]

Update: 2020-07-15 06:46 GMT

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీలో సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటుపై నివేదిక ఇచ్చిన తరువాత దానిని పరిశీలించి, జిల్లాలు ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రభుత్వం 8 నెలల గడువు పెట్టింది.

పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దుల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు జరుగనుంది. దీంతో 13 జిల్లాల స్థానం 25 జిల్లాలు ఏర్పాటు కానుండగా, కేబినెట్ భేటీలో 26వ జిల్లా గురించిన చర్చ జరిగింది. ఉత్తరాంధ్రలో అరకు నియోజకవర్గం దేశంలోనే పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటి. అంతే కాకుండా ఆ నియోజకవర్గం అటు శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాతంతో పాటు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు విస్తరించింది. దీంతో ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా విడగొడితే ఎలా? ఉంటుందన్న చర్చ జరిగింది. భౌగోళికంగా పూర్తి వేర్వేరు ప్రాంతాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని కేబినెట్ అభిప్రాయపడింది. దీంతో అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని అరు, పార్వతీపురం జిల్లాలుగా ఏర్పాటు చేయాలని భావించింది. అయితే జిల్లాల ఏర్పాటుపై సమగ్ర నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోనుంది.

ఇక జిల్లాల ఏర్పాటు వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాంధ్రలో విశాఖపట్టణంతో పాటు అదనంగా అనకాపల్లి, అరకు, పార్వతీపురం జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అరకు, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాలు ఉంటాయి.

ఇక కోస్తా విషయానికి వస్తే.. తూర్పు గోదావరి జిల్లా మరో మూడు జిల్లాలుగా చీలి… రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలుగా ఏర్పడనుంది. పశ్చిమగోదావరి జిల్లా ఇంకో రెండు జిల్లాలుగా చీలి… ఏలూరు, నర్సాపురం జిల్లాలుగా ఏర్పడతాయి. కృష్ణా జిల్లా విజయవాడ, మచిలీపట్నం జిల్లాలుగా ఏర్పడుతుంది. గుంటూరు జిల్లాలో బాపట్ల, నర్సారావుపేట జిల్లాలుగా ఏర్పడనున్నాయి.

ఇక రాయలసీమ విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లా కానుంది. ఇక కడప జిల్లాకు అదనంగా రాజంపేట జిల్లా అవనుంది, కర్నూలు జిల్లాకు అదనంగా నంధ్యాల జిల్లా కానుంది. అనంతపురానికి తోడు హిందూపురం జిల్లా కానుందన్న అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News