ఏపీ సరిహద్దుల ఉద్రిక్తతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

తెలంగాణ నుంచి ఏపీ కి బయల్దేరిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులను సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న ఘటనలపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ చేపట్టింది. తెలంగాణ ఇచ్చిన ఎన్ఓసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని ఆదేశించింది. ఆరోగ్యంగా ఉన్న వారిని అనుమతించాలని చెప్పింది. ఆరోగ్యంగా లేనివారిని క్వారంటైన్‌కు తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్వారంటైన్ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచాలని సూచించింది. ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా, రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో బీజేపీ […]

Update: 2020-03-27 02:57 GMT

తెలంగాణ నుంచి ఏపీ కి బయల్దేరిన విద్యార్థులు, ఐటీ ఉద్యోగులను సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న ఘటనలపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ చేపట్టింది. తెలంగాణ ఇచ్చిన ఎన్ఓసీని ఎంట్రీ పాయింట్‌లోనే పరిశీలించాలని ఆదేశించింది. ఆరోగ్యంగా ఉన్న వారిని అనుమతించాలని చెప్పింది. ఆరోగ్యంగా లేనివారిని క్వారంటైన్‌కు తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్వారంటైన్ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచాలని సూచించింది. ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా, రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Tags: ap, boarders, tension, ap highcourt

 

Tags:    

Similar News