ఏపీకి మరో తుఫాన్ ప్రమాదం

దిశ, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఈనెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్రవాయుగుండం కాస్త తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, డిసెంబర్‌ నెలల్లో రెండు తుఫాన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌ 2న బురేవి తుఫాన్‌ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై అధిక ప్రభావం చూపనుందిని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, […]

Update: 2020-11-28 09:33 GMT

దిశ, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఈనెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్రవాయుగుండం కాస్త తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, డిసెంబర్‌ నెలల్లో రెండు తుఫాన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌ 2న బురేవి తుఫాన్‌ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై అధిక ప్రభావం చూపనుందిని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ, రాయాలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్ధాయిలో అప్రమత్తం కావడంతో పాటు, ప్రతి జిల్లాలోనూ కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News