అసంపూర్తిగా ఆర్టీసీ చర్చలు..

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకల ఒప్పందంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. బుధవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్లర్లు (ఈడీ)లు సమావేశమయ్యారు. 1.61లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ ఈ సమావేశంలో ప్రతిపాదించింది. అయితే, దీనిపై సమీక్షించాక నిర్ణయం తీసుకుంటామని ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. మళ్లీ రెండు వారాల తర్వాత దీనిపై చర్చించాలని ఇరు రాష్ట్రాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.

Update: 2020-10-07 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల రాకపోకల ఒప్పందంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. బుధవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్లర్లు (ఈడీ)లు సమావేశమయ్యారు. 1.61లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ ఈ సమావేశంలో ప్రతిపాదించింది.

అయితే, దీనిపై సమీక్షించాక నిర్ణయం తీసుకుంటామని ఏపీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. మళ్లీ రెండు వారాల తర్వాత దీనిపై చర్చించాలని ఇరు రాష్ట్రాల అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.

Tags:    

Similar News