విద్యుత్ ఉద్యోగుల పంచాయితీ.. సుప్రీంలో పిటిషన్!

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ ఉద్యోగుల పంపిణీ విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న అభ్యంతరాలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. తాజాగా ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. స్థానికత లేని 586మంది ఉద్యోగులను తమకు కేటాయించారని తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అయితే, తెలంగాణ సంస్థల వాదనపై ఏపీ విద్యుత్ సంస్థలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తమను ఏపీ విద్యుత్ సంస్థలు రిలీవ్ […]

Update: 2020-08-26 07:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ ఉద్యోగుల పంపిణీ విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న అభ్యంతరాలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. తాజాగా ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. స్థానికత లేని 586మంది ఉద్యోగులను తమకు కేటాయించారని తెలంగాణ విద్యుత్ సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అయితే, తెలంగాణ సంస్థల వాదనపై ఏపీ విద్యుత్ సంస్థలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు తమను ఏపీ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేశాయని బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. వాదోపవాదాల అనంతరం ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. కాగా, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Tags:    

Similar News