కరణ్‌తో బ్రేకప్‌పై నోరు విప్పిన వీజే అనుషా
దిశ, వెబ్‌డెస్క్: టెలివిజన్ పర్సనాలిటీ, వీజే అనుషా దండేకర్ హీరో కరణ్ కుంద్రాతో బ్రేకప్ గురించి లాంగ్ నోట్ రిలీజ్ చేసింది. తనతో బ్రేకప్‌ను చాలాసార్లు ఖండించిన అనుషా.. మోసపోయానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో ప్రేమ అనేది నిరంతర యుద్ధం కాకూడదని ఓ పోస్ట్ పెట్టింది. 2020ని బ్రేకప్‌తో ఎండ్ చేస్తూ, కొత్త ఏడాదిలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్న అనుషా.. ‘అవును, నేను లవ్ స్కూల్ […]
దిశ, వెబ్‌డెస్క్: టెలివిజన్ పర్సనాలిటీ, వీజే అనుషా దండేకర్ హీరో కరణ్ కుంద్రాతో బ్రేకప్ గురించి లాంగ్ నోట్ రిలీజ్ చేసింది. తనతో బ్రేకప్‌ను చాలాసార్లు ఖండించిన అనుషా.. మోసపోయానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో ప్రేమ అనేది నిరంతర యుద్ధం కాకూడదని ఓ పోస్ట్ పెట్టింది. 2020ని బ్రేకప్‌తో ఎండ్ చేస్తూ, కొత్త ఏడాదిలో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్న అనుషా.. ‘అవును, నేను లవ్ స్కూల్ అనే షో చేశాను, నేను మీ లవ్ ప్రొఫెసర్, నేను మీతో పంచుకున్న ప్రతీ విషయం, ప్రతీ సలహా ఎప్పుడూ నిజమైందే, నా హృదయం నుంచి వచ్చిందే. అవును నేను కష్టపడి ప్రేమించాను, చాలా కష్టపడ్డాను.. కానీ అక్కడ ప్రయత్నించేందుకు, పోరాడేందుకు ఏమీ లేకపోవడంతో బయటకు వచ్చాను. అవును, నేను కూడా మనిషినే, నేను నన్ను పూర్తిగా కోల్పోయాను, నా ఆత్మగౌరవాన్ని కోల్పోయాను, మోసపోయాను.. క్షమాపణ కోసం ఎదురుచూశాను.. కానీ అది ఎప్పుడూ రాలేదు’ అని తెలిపింది. చిన్నప్పటి నుంచి పాజిటివిటీతో పెరిగానని.. ఫ్యూచర్‌లో కూడా అలాగే ఉంటానంది.
ప్రేమ అనేది చాలా రూపాల్లో వస్తుందని, ఖచ్చితంగా ప్రేమించబడాలన్న అనుషా.. మిమ్మల్ని మీరు ప్రేమతో బాధపడిపోయేలా చేసుకోకండని సూచించింది. ప్రేమను గౌరవప్రదంగా, దయగా, నిజాయితీగా ఉండనివ్వాలని కోరింది. లైఫ్ లెస్సన్స్ నేర్పిన మంచి, చెడులకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. ‘నా ప్రేమ కథ ఇప్పుడు నాతోనే మొదలవుతుంది’ అని చెప్పింది.