ఆగని మరణాలు.. డెంగ్యూ లక్షణాలతో మరో మహిళ మృతి
దిశ, ములకలపల్లి: కరోనా అనంతరం ప్రబలుతున్న విషజ్వరాలతో పాటు డెంగ్యూ లక్షణాలతో ములకలపల్లి మండలంలో వరస మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం ఉదయం జగన్నాథపురానికి చెందిన సోయం సునీత (32) డెంగ్యూ లక్షణాలతో మృతి చెందింది. మృతురాలు సునీత గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. సునీతను కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమెకు రక్త కణాలు తక్కువ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి చికిత్స అందించినట్లు తెలిసింది. మృతురాలికి ఒక పాప, బాబు ఉన్నారు. […]
దిశ, ములకలపల్లి: కరోనా అనంతరం ప్రబలుతున్న విషజ్వరాలతో పాటు డెంగ్యూ లక్షణాలతో ములకలపల్లి మండలంలో వరస మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం ఉదయం జగన్నాథపురానికి చెందిన సోయం సునీత (32) డెంగ్యూ లక్షణాలతో మృతి చెందింది. మృతురాలు సునీత గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. సునీతను కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమెకు రక్త కణాలు తక్కువ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి చికిత్స అందించినట్లు తెలిసింది. మృతురాలికి ఒక పాప, బాబు ఉన్నారు.
ఆగని మరణాలు ఆందోళన లో ప్రజలు
మండల వ్యాప్తంగా ఆగస్టు-సెప్టెంబర్ లో ఇప్పటివరకు ఆరుగురు జ్వర పీడితులు మృత్యువాత పడ్డారు. ఆగస్టు 2న మంగపేట గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మీ ప్రసన్న (8), ఆగస్టు 3న మొగరాలగుప్ప గ్రామానికి చెందిన రవ్వ వెంకటేష్ (40), ఆగస్టు 26 మాధారం గ్రామానికి చెందిన కొట్టే అనూష(11), ఆగస్టు 31న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందటం మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. అంబేద్కర్ నగర్‌కు చెందిన గంట అలివేలు(50), కమలాపురం కు చెందిన జక్క రామకృష్ణ (25) జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు. తాజాగా జగన్నాథపురం గ్రామానికి చెందిన సోయం సునీత (32) మృతి చెందారు.