‘దిశ’ ఎన్‌కౌంటర్ కేసులో ట్విస్ట్.. రూ.కోటి ఆఫర్!
దిశ, వెబ్‌డెస్క్ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు మరో మలుపు తీసుకుంది. 2019 నవంబర్ 28వ తేదీన శంషాబాద్‌కు చెందిన వెటర్నిటీ డాక్టర్ షాద్‌నగర్‌లో హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో నలుగురు నిందితులు (లారీ డ్రైవర్స్ అండ్ క్లినర్స్)ను సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ అండ్ టీం సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో సమయంలో ఎన్ కౌంటర్ చేశారు. ఆ తర్వాత బాధితకుటుంబ సభ్యులు ఈ ఎన్ కౌంటర్‌పై […]
దిశ, వెబ్‌డెస్క్ : దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు మరో మలుపు తీసుకుంది. 2019 నవంబర్ 28వ తేదీన శంషాబాద్‌కు చెందిన వెటర్నిటీ డాక్టర్ షాద్‌నగర్‌లో హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో నలుగురు నిందితులు (లారీ డ్రైవర్స్ అండ్ క్లినర్స్)ను సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ అండ్ టీం సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో సమయంలో ఎన్ కౌంటర్ చేశారు. ఆ తర్వాత బాధితకుటుంబ సభ్యులు ఈ ఎన్ కౌంటర్‌పై కేసు పెట్టారు. ఘటన జరిగిన ఏడాది తర్వాత ప్రస్తుతం ఆ కేసులను విరమించుకుంటే బాధిత కుటుంబం ఒక్కొక్కరికీ రూ.25లక్షలు ఇస్తామని ఓ వ్యక్తి ఆఫర్ చేసినట్లు సమాచారం.
అయితే, ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఇదిలాఉండగా, బాధిత కుటుంబసభ్యుల తరఫున కేసు వాదిస్తున్న లాయర్ ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదానికి డబ్బులు ఆఫర్ చేస్తున్న వ్యక్తికి ఏదైనా సంబంధం ఉందా..? దిశ ఘటన జరిగి ఏడాది గడిచింది. అయితే, ఇన్నిరోజులు వినబడని ఆ అజ్ఞాత వ్యక్తి పేరు ఒక్క సారిగా తెరమీదకు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో దిశ రేప్ అండ్ మర్డర్, ఎన్‌కౌంటర్ కేసులో ఏదైనా కుట్రకోణం దాగుందా..? అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. కాగా, రోజువిడిచి రోజు కేసు వాపసు తీసుకోవాలని ఓ వ్యక్తి బాధిత కుటుంబ సభ్యులతో తరుచూ ఫోన్ చేసి డబ్బులు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.