తెలంగాణలో మరో మూడు కేసులు

రాష్ట్రంలో తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దుబాయ్ నుంచి వచ్చిన సికింద్రాబాద్‌ వ్యాపారి, లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 16కు పెరిగింది. సికింద్రాబాద్కు చెందిన వ్యాపారి ఈ నెల 14న దుబాయ్ నుంచి రాగా, 17న తీవ్రమైన జలుబు, దగ్గుతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. అతనికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక సంగారెడ్డికి చెందిన […]

Update: 2020-03-19 20:13 GMT

రాష్ట్రంలో తాజాగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దుబాయ్ నుంచి వచ్చిన సికింద్రాబాద్‌ వ్యాపారి, లండన్ నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 16కు పెరిగింది.
సికింద్రాబాద్కు చెందిన వ్యాపారి ఈ నెల 14న దుబాయ్ నుంచి రాగా, 17న తీవ్రమైన జలుబు, దగ్గుతో గాంధీ ఆసుపత్రిలో చేరారు. అతనికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక సంగారెడ్డికి చెందిన యువకుడు లండన్ నుంచి బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని నేరుగా ఆసుపత్రికి తరలించారు. నల్లగొండకు చెందిన మరో యువకుడు కూడా లండన్ నుంచి బుధవారం వచ్చాడు. అతనిలోనూ వ్యాధి లక్షణాలు ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరికి కరోనా సోకినట్లు వైద్యులు గురువారం ప్రకటించారు.

Tags: corona, positive case, ts news, 3 positive cases registered

Tags:    

Similar News