కంటోన్మెంట్లో టీఆర్ఎస్కు మరో షాక్
దిశ, కంటోన్మెంట్: భారతీయ జనతా పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. కంటోన్మెంట్ నుంచి రోజుకో నేత కమలం గూటికి చేరుతున్నాడు. ఇప్పటికే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె.రామక్రిష్ణ, జంపనప్రతాప్, భానుక నర్మదలతోపాటు భానుక మల్లీకార్జున్, టి.ఎన్.మురారి,బాణాల శ్రీనివాస్ రెడ్డి తదితర నేతలు బీజేపీలో చేరారు. తాజాగా శుక్రవారం ఏడవ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.బి.శంకర్ రావు బీజేపీ తీర్థం పుచ్చు కున్నారు. కే.బీ.శంకర్ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి కండువా […]
దిశ, కంటోన్మెంట్: భారతీయ జనతా పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. కంటోన్మెంట్ నుంచి రోజుకో నేత కమలం గూటికి చేరుతున్నాడు. ఇప్పటికే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె.రామక్రిష్ణ, జంపనప్రతాప్, భానుక నర్మదలతోపాటు భానుక మల్లీకార్జున్, టి.ఎన్.మురారి,బాణాల శ్రీనివాస్ రెడ్డి తదితర నేతలు బీజేపీలో చేరారు.
తాజాగా శుక్రవారం ఏడవ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.బి.శంకర్ రావు బీజేపీ తీర్థం పుచ్చు కున్నారు. కే.బీ.శంకర్ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంతోనే కంటోన్మెంట్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందన్నారు.