కేసీఆర్ పేరుతో మరో స్కీం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ పేరుతో మరో కిట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్‌ను ఇస్తున్న సర్కార్.. ఇక నుంచి గర్భిణీల్లో రక్తహీనతను నివారించేందుకు కేసీఆర్ న్యూట్రీయంట్ పేరిట మరో కిట్‌ను పంపిణీ చేయనుంది. గర్భిణీలు, పుట్టబోయే శిశువుల్లో రక్తం వృద్ధి చెందేందుకు అవసరమైన పౌష్టికాహారాన్ని ఆ కిట్‌లో ఉంచనున్నారు. ముఖ్యంగా ప్రోటీన్ పౌడర్, ఖర్జూర, ఇతర డ్రై ప్రూట్స్, ఐరన్, విటమిన్ మాత్రలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సుమారు నాలుగు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ పేరుతో మరో కిట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్‌ను ఇస్తున్న సర్కార్.. ఇక నుంచి గర్భిణీల్లో రక్తహీనతను నివారించేందుకు కేసీఆర్ న్యూట్రీయంట్ పేరిట మరో కిట్‌ను పంపిణీ చేయనుంది. గర్భిణీలు, పుట్టబోయే శిశువుల్లో రక్తం వృద్ధి చెందేందుకు అవసరమైన పౌష్టికాహారాన్ని ఆ కిట్‌లో ఉంచనున్నారు. ముఖ్యంగా ప్రోటీన్ పౌడర్, ఖర్జూర, ఇతర డ్రై ప్రూట్స్, ఐరన్, విటమిన్ మాత్రలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
సుమారు నాలుగు వేల రూపాయలు విలువ ఈ కిట్‌ను మొదటి, రెండో యాంటినాటల్ చెకప్ సమయంలో ప్రతీ గర్భిణీకి రెండు సార్లు ఇవ్వనున్నారు. ప్రతీ ఏటా సుమారు ఆరున్నర లక్షల మందికి ఈ కిట్లను అందించాల్సి వస్తుందని ఓ అధికారి తెలిపారు. ఇదే అంశంపై సీఎస్ సోమేష్‌కుమార్ హెల్త్ హెచ్ఓడీలతో బుధవారం బీఆర్కే భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అతి త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు.