నల్లగొండ జిల్లాలో తాజాగా మరో కేసు
దిశ, నల్లగొండ: జిల్లాలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైంది. తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన ఓ యువకుడికి అనారోగ్యం కారణంగా మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు తరలించారు. కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆదివారం రాత్రి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన యువకుడి సోదరుడికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఆ మరుసటి రోజు గ్రామంలో ఉప్పలమ్మ పండుగ జరగడంతో భారీగా బంధువులు, గ్రామస్తులు హాజరయ్యారు. […]
దిశ, నల్లగొండ: జిల్లాలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైంది. తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన ఓ యువకుడికి అనారోగ్యం కారణంగా మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు తరలించారు. కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆదివారం రాత్రి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన యువకుడి సోదరుడికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. ఆ మరుసటి రోజు గ్రామంలో ఉప్పలమ్మ పండుగ జరగడంతో భారీగా బంధువులు, గ్రామస్తులు హాజరయ్యారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని ఇళ్ల నుంచి బయటికి ఎవరు రావద్దని సూచనలు చేశారు. ఆరోగ్య సిబ్బంది కరోనా పాజిటివ్ వ్యక్తి కాంటాక్ట్స్‌ను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.