ఏపీలో మరో కొత్త పథకం.. వారందరికోసమేనన్న జగన్

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 9న మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం మాట్లాడిన ఆయన జనవరి 9న ఈబీసీ నేస్తం అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత అంశంపై అసెంబ్లీలో ప్రసంగించిన జగన్ అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారని చెప్పుకొచ్చారు. అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నప్పటికీ వారికి సరైన ఫలాలు అందడం లేదని వారికి కూడా మేలు చేయాలనే సంకల్పంతో ఈబీసీ నేస్తం […]

Update: 2021-11-18 06:16 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 9న మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం మాట్లాడిన ఆయన జనవరి 9న ఈబీసీ నేస్తం అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత అంశంపై అసెంబ్లీలో ప్రసంగించిన జగన్ అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారని చెప్పుకొచ్చారు.

అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నప్పటికీ వారికి సరైన ఫలాలు అందడం లేదని వారికి కూడా మేలు చేయాలనే సంకల్పంతో ఈబీసీ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. జనవరి 9న తన పాదయాత్ర ముగింపు రోజు కాబట్టి అదే రోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తామని.. ఈబీసీ నేస్తం ద్వారా ఈబీసీలకు మరింత మేలుచేస్తానని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు.

Tags:    

Similar News